మన న్యూస్, నాయుడుపేట: రాష్ట్రంలో వెన్నుపోటు అలవాటు చేసింది చంద్రబాబు నాయుడని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా మాజీ సీఎం వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో రాష్ట్ర మొత్తం వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో తిరుపతి జిల్లా,నాయుడుపేటలో వైసీపీ పట్టణ అధ్యక్షులు కలికి.మాధవరెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ..... రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి వెన్నుపోటు అలవాటు చేసింది చంద్రబాబని అబద్ధాలు మోసాలతో కూడిన పాలనను ప్రజలు అందిస్తు రాష్ట్రాన్ని దగా చేస్తున్నారని టిడిపి నాయకులను దుయ్యబట్టారు.వైస్రాయ్ హోటల్లో అప్పటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మామ ఎన్టీ రామారావు కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు.సూపర్ సిక్స్ హామీల్లో పింఛన్ల పంపిణీ తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్లేదని విమర్శించారు.సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని అబద్ధాలు చెప్పి,ప్రజలను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారని విమర్శించారు.ప్రజా వ్యతిరేక పాలన పై గళం ఎత్తిన ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని అక్రమ కేసుల్లో అరెస్టు చేశారని అన్నారు.అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు.కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయినప్పటికీ అబద్దాల హామీలు నెరవేర్చలేకపోతున్నారని విమర్శించారు.కూటమి ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలను వెన్నుపోటు పొడిచారని అన్నారు. తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు స్థానిక వైసిపి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ నాయుడుపేట తాసిల్దార్ కార్యాలయం చేరుకున్నారు.సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని తహసిల్దార్ ఎం.రాజేంద్ర కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శికామిరెడ్డి.సత్యనారాయణరెడ్డి,వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి.సుబ్రహ్మణ్యం రెడ్డి,మాజీ ఎఎంసి చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి,వైసీపీ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి.రాజారెడ్డి,నాయుడుపేట మండలం వైసిపి అధ్యక్షులు ఒట్టూరు.కిషోర్ యాదవ్,నాయుడుపేట పట్టణ పార్టీ అధ్యక్షులు కలికి.మాధవరెడ్డి,నాయుడుపేట మున్సిపల్ చైర్ పర్సన్ కటకం.దీపిక,నాయుడుపేట ఎంపిపి కురుగొండ.ధనలక్ష్మి,పెళ్లకూరు జెడ్పిటిసి సభ్యులు నన్నం.ప్రిస్కిల్లా,పెళ్ళాకూరు ఎంపిపి శేఖర్ రెడ్డి,ఓజిలి ఎంపిపి గడ్డం.అరుణా,నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు కట్టా.భవాని శంకర్ రెడ్డి,మాజీ ఎ.ఎం.సి చైర్మన్ కట్టా.కమలాకర్ రెడ్డి,మహిళ అధ్యక్షురాలు ఈదా.రత్న శ్రీ,మున్సిపల్కౌన్సిలర్లు దారా.రవిబాబు,పాలేటి.నాగార్జు,దువ్వూరు.లక్ష్మీనారాయణ రెడ్డి, కావేరిపాకం.అశోక్ కుమార్,కో ఆప్షన్ సభ్యులు చదలవాడ.కుమార్,వైసీపీ నాయకులు మద్దాలి.సోమశేఖర్ రెడ్డి,మునస్వామినాయుడు,గంద వల్లి.సిద్దయ్య పలువురు నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.