నాగోల్. మన న్యూస్; Elite Gamers Garege నాగోల్ ఉప్పల్ బాగ్ హయత్ లో గల విక్రంత్ బ్యాడ్మింటన్ అకాడమీ లో జరిగిన రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ -2025 నీ ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త .ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ జూన్ 5 నుండి 8 వ తేదీ వరకు తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ మెన్ & ఊమెన్ అండ్ వెరెరన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ జరుగుతుంది అని ఆయన తెలిపారు.క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అని క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అని ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.కార్యక్రమం లో పాల్గొన్న వారు రంగారెడ్డి జిల్లా ఉపాధక్షులు పి ఆనందబాబు, కార్యదర్శి కరెడ్ల శ్రీనివాస రావు, సంయుక్త కార్యదర్శి సాయిరెడ్డి, వెంకటేష్ గుప్తా, సత్యం, ఫణి కిషోర్ కోచ్, శ్రీ లక్ష్మారెడ్డి , వి.సురేష్ కుమార్, సూరి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.