శంఖవరం మన న్యూస్ (అపురూప్): కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన నడుస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబి) పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) అధ్యక్షతన జనసేన పార్టీ శంకవరం మండలం అధ్యక్షుడు గాబు సుభాష్ ఉపాధ్యక్షుడు తలపంటి అప్పారావు (బుజ్జి) ఆధ్వర్యంలో శంఖవరం మండలంలోని నేల్లిపూడి లో సంవత్సర పాలన సంక్రాంతి సంబరాలుగా బుధవారం నిర్వహించారు. సంబరాలలో భాగంగా గ్రామంలో గల జనసేన పార్టీ కార్యాలయం నందు మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. అలాగే ఈ పోటీలలో విజేతలకు, పాల్గోన్న ప్రతి మహిళకు బహుమతులను నాయకులంతా అందించారు. అనంతరం జనసేన పార్టీ విడుదల చేసి పోస్టర్లను కూటమి నాయకులు ఆవిష్కరించారు. అనంతరం జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయ కర్త మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబి) మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ప్రజలకే సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివఅద్ధి వైపు నడిపించే ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికీ ఏడాది పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అనేక విజయాలను సాధించడంతో పాటు రాష్ట్రానికి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్థిరీకరణతోపాటు అనేక సంక్షేమ, అభివఅద్ధి పథకాలు సాధించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రోడ్లు అస్తవ్యస్తం యువత చెడు వ్యసనాలకు బానిసలై సమాజానికి కీడు చేసే విధంగా తయారు చేసి రైతులకి గిట్టుబాటు ధరలు లేక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలుపోయామన్నారు.అనంతరం శంకవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్ మాట్లాడుతూ, కుటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమిష్టిగా ప్రజల కోసం అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అభివఅద్ధి వైపు నడిపించే విధంగా గాడిన పెట్టే విధంగా పరిపాలన చేస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ కార్యకర్తలు నియమ నిబంధనలతో చిత్తశుద్ధితో ముందడుగు వేస్తున్నారని, జనసేన క్రియాశీలక సభ్యత్వాలు నమోదు, జనసేన సభ్యత్వం కలిగి ప్రమాదవశాత్తు పడిన కుటుంబాలకు ఆసరా కల్పిస్తూ దిగ్విజయంగా సంవత్సరం పూర్తయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బద్ది రామారావు, , జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, బిజెపి నాయకులు గంటా బాలు దొర,జిల్లా టెలికాం సభ్యులు మేకల కృష్ణ, మండపం జనసేన నాయకులు పొలం వెంకటరత్నం, కత్తిపూడి గ్రామ అధ్యక్షులు పోసిన శ్రీను, తలపంటి నాగేశ్వరరావు,తలపంటి బలరాం, కుక్క రాజు ,కొంజెర్ల నాగేశ్వరరావు, తలపంటి వీరబాబు, పీర్ల నాని,తలపంటి హనుమంతు, పిడం రాజు, తలపంటి శ్రీను, కీర్తి కుమార్, మరియు జనసైనికులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.