Mana News :- ప్రత్తిపాడు (మన న్యూస్ ప్రతినిధి) :- ప్రత్తిపాడు జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్ర గిరి కొండపై వివేకానంద స్వామి విగ్రహం ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ 12వ తేదీన పరమహంస పరివ్రాజకులు, పద్మ భూషణ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి రానున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన చాట్ల పుష్పారెడ్డి,పత్రి రమణ తెలిపారు. చిన్న జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో వేదమంత్రాలతో శ్రీరామ పాదుకా పూజ వేలాది మంది భక్తులతో నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తున్నామని,ఆసక్తి ఉన్న భక్తులు కమిటీ వారిని సంప్రదించి పేరు నమోదు చేయించుకోవాలని భక్తులకు తెలియజేస్తున్నామని అన్నారు.ఆయనకు హిందూ సాంప్రదాయం ప్రకారం వివిధ రకాలసాంస్కృతిక కార్యక్రమాలతో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.ప్రముఖ వ్యాపారవేత్త చామంతుల శ్రీనివాసరావు ఇంటి వద్ద నుండి ఆంధ్రా భద్రాద్రి క్షేత్రం వరకు నడక మార్గంలోనే ఆయన చేరుకుంటారని,అందువల్ల రోడ్లకి ఇరువైపులా శుభ్రపరచి ఘన స్వాగతం పలకడానికి ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నట్లు తెలిపారు.ఈ అభివృద్ధి పనుల పర్యవేక్షణలో నేతి శ్రీనివాసరావు,గంటా నాగబాబు,కంబాల నారాయణరావు,తోలేటి రామకృష్ణ ఉన్నారు.