Mana News:- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి): ఈనెల 16వ తేదీన అర్ధాంతరంగా మూసివేసిన ఏలేశ్వరం మండలం చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషుబాబ్జి డిమాండ్ చేశారు. ఈ మేరకు మూతపడ్డ ఫ్యాక్టరీ ఎదుట గత ఏడు రోజులుగా ధర్నాలు నిర్వహిస్తున్న కార్మికులను శేషు బాబ్జి కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 409 మంది కార్మికులు పనిచేస్తున్న జీడిపిక్కలు ఫ్యాక్టరీని యాజమాన్యం అర్ధాంతరంగా మూసివేయటంతొ కార్మికులు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రతి కార్మికునికి సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం, పిఎఫ్, ఇతర అలవెన్సులు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు సిఐటియు ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు, కార్మిక నాయకులు అనిశెట్టి వీరబాబు, వి రాజేష్, గంగరాజు, చక్రధర్, దుర్గాప్రసాద్, వి వీరబాబు, ఎస్ జయలక్ష్మి, వై శివవరలక్ష్మి, కె కృష్ణవేణి పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నారు.