Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 22)మన న్యూస్ :- శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు.శుక్రవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని బొల్లారం ప్రధాన రహదారి నుండి బికే ఎంక్లేవ్, రెడ్డి కాలనీ, ప్రజా షెల్టర్ నుండి మక్త మహబూబ్ పేట్ విలేజ్ వరకు లింక్ రోడ్డు రూ. 85 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పల పాటి శ్రీకాంత్ తో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యతలో రాజీపడకుండా అభివృద్ది పనులు చేపడుతున్నామని తెలిపారు. మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సెంట్రల్ పార్క్ ఫేజ్-2 కాలనీని అభివృద్దికి కట్టుబడి ఉన్నానని, ప్రాధాన్యత క్రమంలో అభివృద్ది పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.