Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 22)మన న్యూస్ ,వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 19 మంగళవారం రాత్రి మదీనాగూడ ప్రధాన రహదారిలోని జిఎస్ఎం మాల్ వద్ద రోడ్డు దాటుతున్న ఒక గుర్తు తెలియని వృద్ధుడు (70) ని గుర్తు తెలియని వాహనము ఢీ కొట్టి వెళ్లిపోయారు.దీంతో తీవ్ర గాయాలు పాలైన వృద్ధుడిని జిఎస్ఎం షాపింగ్ మాల్ సెక్యూరిటీ వారు చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలో తీవ్ర గాయలైన వృద్ధుడు చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడని వైద్యులు తెలిపారు.ఈ మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఎవరైనా వృద్ధుడి వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ సెక్టార్ ఎస్సై చంద్రయ్య తెలిపారు.