మన న్యూస్: పినపాక మండలానికి చెందిన రైతు గృహాజ్యోతి సబ్సిడీ కోసం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఆన్లైన్ లో అసలు కుటుంబ వివరాలు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే… పినపాక మండల పరిదిలోని దుగినేపల్లి గ్రామానికి చెందిన బత్తుల చిన లక్ష్మీనారాయణ శుక్రవారం నాడు తన గృహావినియోగానికి సంబంధించిన సబ్సిడీ కోసం ప్రజాపాలన దరఖాస్తు రసీదు తో మండల పరిషత్ కార్యాలయాన్ని సంప్రదించాడు. ప్రజాపాలన దరఖాస్తు రశీదు, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో వివరాల కోసం తనిఖీ చేసిన అధికారులు అసలు కుటుంబ వివరాలే(ఆన్లైన్ చేయలేదు) నమోదు కాలేదని తెలియపరిచారు. ఆన్లైన్ చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ఆకుటుంబం దూరమవ్వనుంది. ప్రజాపాలన దరఖాస్తు రశీదు ఇచ్చి ఆన్లైన్ లో నమోదు చేయకపోవడం వల్ల ఒ కుటుంబo ప్రభుత్వ పథకాలకు దూరమవుతుంది. రశీదు ఇచ్చి ఆన్లైన్లో నమోదు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యమే అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరలా ప్రభుత్వం నుండి కొత్తగా ప్రజాపాలన దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చేవరకు వేచి చూడాల్సిందేనని సంబంధిత అధికారులు బాధితునికి తెలియజేసినట్టు తెలియవస్తుంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని బాధితుడు కోరుతున్నాడు.