మన న్యూస్, నెల్లూరు, జూన్ 2:నెల్లూరు మాగుంట లేఔట్ వద్దగల ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు సోమవారం ప్రకటించిన జె.ఇ.ఇ అడ్వాన్స్డ్-2025 ఫలితాలలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సాధించారు.ఎమ్.వి.ఎస్.హేమంత్ (256039280) - 890, బి.బాలసుబ్రమణ్యం(256039381) 2164,ఎమ్.మోహనప్రియ (256038094)-2384, ఆర్. యశ్వంత్ (256038151)-2673, వి.బాల హర్షిత(256039153) - 5111, ఎమ్. చరణ్ తేజరెడ్డి (256038011) 5145, ఎస్.డి. అఫ్జల్ షరీప్ (256039120)-5457, వై.వెంకటచరణ్ తేజ (256038123)- 6333, ఎ.దుర్గహనుమంత్ ప్రసాద్ (256038046) -7263, ఇ.క్రిష్ణవంశీ (256039292)- 9476 వంటి అత్యత్తమ ర్యాంకులను జాతీయ స్థాయిలో సాధించి గర్వకారణంగా నిలిచారు.ఈ సందర్భంగా ఓవెల్ విద్యాసంస్థల చైర్మన్ మరియు మేనిజింగ్ డైరక్టర్ రంగిశెట్టి వేణు మాట్లాడుతూ .....పాన్ ఇండియా స్థాయి లెక్చరర్స్ చే బోధన ప్రతి తరగతిలో పరిమిత విద్యార్థులనే ఉంచి వ్యక్తిగత శ్రద్ధను కనబరచడం, పటిష్టమైన పరీక్షా విధానాలు, ఒత్తిడి లేని ప్రణాళికతో పాటుఎన్నో నూతన విధానాలతో ముందుకు సాగడమే ఓవెల్ విజయాలకుమూలకారణమనితెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ.. ఈ విజయాలకు పరోక్షంగా సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఓవెల్ విధ్యాసంస్థల సి.ఇ.ఒ. రంగి శెట్టి ప్రమీల జి.ఎమ్. మహదేవ్, ఇ.డి. బాలు, ఎ.జి.ఎమ్. గంగాధర్ , ఎగ్జిక్యూటివ్ ఇంచార్జ్ ఎ.మ్. విద్య, ఐ.ఐ.టి. లెక్చరర్స్ టీమ్ లీడర్స్ పి. సుధీర్, పి. రాము, పి.రఘరామ్ మరియు ఇతర అధ్యాపకులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.