మన న్యూస్, తిరుపతి :- తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు day-by-day పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని నిరోధించేందుకు పోలీసులు మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా చింతలచేను రోడ్డులో నాలుగు హెచ్.డి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు సోమవారం ఈ కార్యాచరణకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: “సీసీ కెమెరాలు 24 గంటల పాటు పనిచేసే విధంగా అమర్చాం. ప్రజల భద్రతను పరిరక్షించడమే మా లక్ష్యం. ఈ కెమెరాల ద్వారా ఏవైనా అనుమానాస్పద సంగటనలు చోటుచేసుకున్నా, వెంటనే గుర్తించి స్పందించవచ్చు. ఇది నేరాల నియంత్రణకు చాలా దోహదపడుతుంది,” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ అరుణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. స్థానికులు ఈ చర్యను స్వాగతిస్తున్నారు. ప్రజల సహకారం ఉంటే, చట్టం చేతిలో చెరినవారిని శాశ్వతంగా నియంత్రించగలమని పోలీసులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.