మన న్యూస్,తిరుపతి, :
నగరంలోని 44 డివిజన్లో 46 47 నిత్యవసర సరుకుల చౌక దుకాణాలను తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేంద్ర నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ల ఆలోచనలతోనే అన్ని వర్గాల ప్రజలు నిత్యవసర సరుకుల తీసుకొనే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. ప్రతిరోజు రెండు పూటలా చౌక దుకాణాల యాజమాన్యం రేషన్ కార్డులు అందరికీ రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న మంచిది నిర్ణయాన్ని మనమంతా స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు ఇస్తామని ముసుగులో నిత్యవసర సరుకులు పక్కదారి పట్టాయి అన్నారు. వైసిపి నేతలు రేషన్ బియ్యాన్ని పంది కుక్కల్లాగా బొక్కేశారని , అలా జరగకూడదని అర్హులైన రేషన్ కార్డుదారులందరికీ నిత్యవసర సరుకులు అందేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఎవరికైనా నిత్యవసర సరుకులు వద్దనుకుంటే వారికి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా రేషన్ సక్రమంగా ఇవ్వకపోతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని సురేంద్ర నాయుడు చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శంకర్, సాయి, ఉదయ్, ధనుంజయ్, జయంతి, వాణి, వెంకట ముని, రమేష్ పాల్గొన్నారు.