కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిని కలసి విన్నవించిన శాప్ చైర్మన్ రవి నాయుడు
Mana News :- తిరుపతి నవంబర్ 21,(మన న్యూస్ ) :- ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర క్రీడల సహాయ శాఖ మంత్రి రక్షా నిఖిల్ కట్సే ను కలిసి రవి నాయుడు విన్నవించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రిని గురువారం తిరుపతిలో షాప్ చైర్మన్ రవి నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కావలసిన సదుపాయాలు, వసతులు, నిధుల విడుదల గురించి సుదీర్ఘంగా కేంద్ర సహాయ మంత్రికి శాప్ చైర్మన్ రవి నాయుడు వివరించారు. అనంతరం రవి నాయుడు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ అమరావతి ప్రాంతాలలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేయాలని అలాగే తిరుపతిలో స్టేట్ లెవల్ ఖేలో ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ సెంటర్ ను నిర్మించాలని అందుకు కేంద్ర నిధులు మంజూరు చేయాలని కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రిని కోరామని మని రవి నాయుడు తెలిపారు. రాష్ట్రంలో క్రీడల మౌలిక సదుపాయాలు ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపమని వాటిని అమలు జరిగేలా చూడాలని కోరారు. క్రీడాకారులు జాతీయ క్రీడా పోటీలలో పాల్గొనేందుకు రైళ్లలో వెళ్లేందుకు అందుకు కన్స్ట్రక్షన్ సౌకర్యాన్ని వెంటనే కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు కేంద్ర క్రీడల సహాయ మంత్రి సానుకూలంగా స్పందించారని, ఆంధ్రప్రదేశ్లో క్రీడాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని రవి నాయుడు తెలిపారు.