Mana News :- సాలూరు నవంబర్21( మన న్యూస్ ):= దేశంలో విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకోవడం కోసం, వేల కోట్లు అధికారులకు అదాని లంచాలు ఇచ్చాడని, అమెరికాలో ఇండియన్ కోర్టులో కేసు నమోదు నేపథ్యంలో ,అదా నీతో ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందాలు అన్నిటిని వెంటనే రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది.పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు పట్టణంలో ఈ విషయమై విలేకరుల సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎన్ వై నాయుడు, మండల కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడారు. సాలూరు మండలంలో కురుకూటి ప్రాంతంలో ఆరు గ్రామాల పరిధిలో 750 ఎకరాలు అదాని పవర్ ప్రాజెక్టు కోసం కేటాయించారని ,దీనిని సిపిఎం గతంలో వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిందని, ఇదే తరహాలో రాష్ట్రంలో కూడా దీనితో పాటు నాలుగు జిల్లాల పరిధిలో అదా నీ ప్రాజెక్టుల కోసం 11 వేల ఎకరాలు అదానికి కేటాయింపులు జరిగాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని తెలిపారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అదా నీకోసం రాష్ట్రంలో కేటాయించిన భూములన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
175 కోట్లు లంచాలు తీసుకున్న అవినీతి అధికారులపై దర్యాప్తు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సెఖి ఒప్పందాలు రద్దుచేసి, ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో గ్రీన్ ఎనర్జీ సర్ఫరా చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.