మనన్యూస్, తవణంపల్లె నవంబర్-21 :-తవణంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పి ఆర్ టి యు చిత్తూరు జిల్లా అధ్యక్షులు వి. ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పి ఆర్ టి యు కార్యవర్గ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలో ఎన్నికల అధికారులుగా పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఏ విజయభాస్కర్ రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎమ్ సురేష్ బాబు రెడ్డి మరియు చిత్తూర్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ సి మోహన్ రెడ్డి వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలియచేయడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో మండల గౌరవ అధ్యక్షులుగా మండల ప్రజా పరిషత్ పాఠశాల టి బాబు రెడ్డి ని ఎన్నుకోవడం జరిగింది అలాగే అధ్యక్షులు గా ఎమ్ బాలచంద్ర రెడ్డి కరణం వాన్డ్ల ఊరు పాఠశాల, మండల ప్రధాన కార్యదర్శి గా ఎమ్ నరసింహ రెడ్డి, సహా అధ్యక్షులు గా టి మునీశ్వర్ ఏ బి సి కాలనీ పాఠశాల, ఉపాధ్యక్షులు గా ఐ భరత్ కుమార్ రెడ్డి వడ్డివానిచేరువు పాఠశాల, కోశాధికారిగా బి ఎమ్ రఘుపతి రెడ్డి కృష్ణాపురం పాఠశాల, అదనపు కార్యదర్శిగా డి రాజేష్ దిగువ తడకర పాఠశాల, మహిళా అధ్యక్షురాలు గా కె వి శమంత కుమారి తడకర పాఠశాల, కార్యదర్శి గా కె గణేష్ పొన్నెడుపల్లి పాఠశాల, మహిళా కార్యదర్శిగా ఎం రజిని గోవిందరెడ్డిపల్లె పాఠశాల. కె సౌందర్య సంతపల్లి పాఠశాల గా వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎన్నికల అధికారులు తెలియచేయడమైనది. అలాగే నూతన కార్యవర్గాన్ని శుభాకాంక్షలు తెలియజేశారు.