మన న్యూస్ ,కడప/ కోవూరు :- సీఎం చంద్రబాబు నాయుడు తోనే స్వర్ణాంద్ర 2047 సాకారం.- నారా లోకేష్ సంస్కారం చాలా గొప్పది.- నియంతతో పోరాడి రాష్ట్రాన్ని, తల్లిదండ్రులకు కాపాడుకున్నారు .- ఉత్తమ నాయకత్వ లక్షణాలున్న అధినేతలతో పనిచేయడం ఎంపీ వేమిరెడ్డికి, నాకు గర్వకారణం - ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి.- మహానాడులో గత పాలన విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు అన్న తీర్మానాన్ని బలపరుస్తూ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ప్రసంగం.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం గత పాలన విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెడుతోందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. రెండవ రోజు మహానాడులో గత పాలన విధ్వంసం నుంచి వికాసం వైపు అన్న తీర్మానాన్ని ఆమె బలపరుస్తూ తన సందేశాన్ని ఇచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రేజ్, ఇమేజ్ తో పాటు ఆయన విజన్ అందుకొని తాము ఎంచుకున్న వ్యాపారంగంలో అప్డేట్స్ చేసుకున్నామన్నారు. లోకల్ టు గ్లోబల్ లీడర్ గా ఉంటూనే మాలాంటి కొత్తవారికి అవకాశం కల్పించడం చిన్న విషయం కాదన్నారు. రాజకీయాన్ని సేవలా భావించే మాలాంటి వారికి ఆయన గౌరవం ఇవ్వడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాజకీయ పార్టీకి వారసుడు కావడం అనేది పెద్ద సాహసమని, అలాంటిది కార్యకర్తల మనసు గెలిచిన లీడర్‌గా నారా లోకేష్ తనను తాను నిరూపించుకున్నారని ప్రశంసలు కురిపించారు. విపత్కర పరిస్థితిలో తల్లిదండ్రులను పార్టీని కాపాడుకుంటూ రాక్షసంగా పరిపాలించిన నియంతతో పోరాడినప్పుడే ఆయన శక్తి ఏంటో తెలిసిందన్నారు. ఉత్తమ నాయకత్వ లక్షణాలు, మనసున్న అధినేతలతో కలిసి పనిచేయడం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి, తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ నేతకు దక్కని గౌరవం నారా చంద్రబాబు నాయుడు కి దక్కిందన్నారు. కష్టపడి పని చేయడం, నిజాయితీగా ఉండటం, నిత్యం ప్రజల భవిష్యత్తు కోసం బతకడం వల్లే ప్రజల గుండెల్లో ఇప్పటికి చంద్రబాబు నిలిచి ఉన్నారన్నారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాష్ట్ర ప్రయాణం సాగుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా, సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడి సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గర్వపడేలా, నా రాజధాని అమరావతి అని చాటేలా నిర్మాణం చేపట్టారు. ఏడాదికి 15% వృద్ధి సాధనతోనే స్వర్ణాంధ్ర 2047 సాధికారమవుందని స్పష్టం చేశారు. 2047 నాటికి 38 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీని చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని, రాష్ట్ర తలసరి ఆదాయం 55 లక్షల సాధనకు 10 సూత్రాలతో ప్రణాళిక రూపొందించారన్నారు. 60 శాతం పట్టణీకరణ, నిరుద్యోగిత తగ్గించడం, 39.12 లక్షల ఎగుమతులను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారని వివరించారు. 2029 నాటికి తలసరి ఆదాయం 5,42,985 సాధించడమే లక్ష్యమన్నారు.కొన ఊపిరితో ఉన్న రాష్ట్రాన్ని కాపాడటమే కాదని, ఆంధ్రప్రదేశ్ అని సగర్వంగా చాటేలా బృహత్ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. పది లక్షల కోట్ల అప్పులు, గాడి తప్పిన వ్యవస్థలు, అస్తవ్యస్తంగా ప్రభుత్వ శాఖలు, పెండింగ్ బిల్లులు వంటి అనేక సవాళ్ల మధ్య తన పాలనానుభవంతో సీఎం చంద్రబాబు పరిపాలన చేస్తున్నరని అన్నారు.ఎన్నికల హామీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. పేదల సేవలో అనే కాన్సెప్ట్ తో పాలన చేస్తూనే, వారి జీవన ప్రమాణాలు మార్చే పథకాలు అనేకం అమలులోకి తీసుకువచ్చారన్నారు. 2014లో 16,000 కోట్ల రెవెన్యూ లోటుతో పాలనను ప్రారంభించినా, 120కి పైకా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పేదవాడు తినే అన్న క్యాంటీన్ ను కూడా మూసేసిందని, కానీ నేడు సంక్షేమం వైపు వెళుతూ మళ్ళీ పథకాలకు ప్రాణం పోసేలా పెన్షన్లు 4 వేలకు పెంచారన్నారు. దేశంలో అత్యధిక పింఛను ఇచ్చే రాష్ట్రం మనదే అని, అధికారం చేపట్టిన మొదటి నెల నుంచి 64 లక్షల మందికి ఇంటి వద్ద పెన్షన్లు ఇవ్వగలుగుతున్నామన్నారు. సూపర్ 6 పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం.. రాష్ట్రాభివృద్ధికి 25 పైగా నూతన పాలసీలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎం పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ వంటి పాలసీలు అమలు చేస్తూ బ్రాండ్ ఏపీకి శ్రీకారం చుట్టారన్నారు. 5000 కోట్లతో కొప్పర్తి, ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ పార్కులు, కర్నూలులో డ్రోన్ హబ్ ఏర్పాటుకు 300 ఎకరాల కేటాయింపు జరిగిందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ ఇద్దరు కలిసి ఎన్నో ప్రయాసలకోర్చి, పేదల గుండె చప్పుడు వింటూ మహోన్నత కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలను ప్రజలకు దగ్గర చేయడం గొప్ప విషయమన్నారు ఇలాంటి వారి నాయకత్వంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తాను కూడా భాగంకావడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు.