మన న్యూస్ ,నెల్లూరు ,మే 28 :కార్యకర్తల సంక్షేమమే జనసేనాని సంకల్పం గా ఒక మహా యజ్ఞం లా ఒకరి తో మొదలై లక్షల సంఖ్యలకు చేరుకున్న జనసేన క్రియాశీలక సభ్యత్వం.జనసేన క్రియాశీలక సభ్యులందరూ గర్వంగా భావించే కిట్లను ప్రతి ఒక్కరికి అందించే బాధ్యతను క్రియా వాలంటీర్లు తీసుకోవాలి.అట్టడుగు వర్గాలకు సేవలను అందిస్తూ దేశ స్థాయి లో గర్వించదగ్గ మన్ననలు పొందుతున్న డిప్యూటీ సీఎం,జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు మరింత కృషి చేద్దాం అని జనసేన నేత గునుకుల కిషోర్ అన్నారు.జనసేన క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న సభ్యులకు బుధవారం జనసేన పార్టీ పార్టీ జిల్లా కార్యాలయం గోమతి నగర్ నందు నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో సిటీ,రూరల్ కు సంబంధించిన క్రియాశీలకు సభ్యుల కిట్లను అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ........కార్యకర్తలకు ప్రమాద భీమా ఐదు లక్షల రూపాయలు కల్పిస్తూ 50 వేల రూపాయలు హాస్పిటలైజేషన్ కల్పిస్తూ దేశంలోనే మొట్టమొదటిగా క్రియాశీలకు సభ్యత్వం చేయించిన ఘనత అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దె .సభ్యులు ఎవరికైనా కిట్లు అందకపోతే జనసేన పార్టీ జిల్లా కార్యాలయం లో ఇన్చార్జ్ జమీర్ ని సంప్రదించవచ్చు.జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ ఆధ్వర్యంలో మునుపెన్నడు నమోదు కానంత క్రియాశీలక సభ్యత్వం చేయించాము.జిల్లా లో2000 సభ్యత్వాలు నమోదు చేసి మొదటి స్థానంలో నూనె మల్లికార్జున నిలిచారు.