మన న్యూస్,తిరుపతి, మే 28:- కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు లో స్వర్గీయ నందమూరి తారకరామారావు 104వ జయంతిని పురస్కరించుకొని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రక్తదానం చేశారు. అంతకుముందు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పీ. భువన్ కుమార్ రెడ్డి, టౌన్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ ఆనంద్ బాబు యాదవ్, రామారావు లు స్వర్గీయ నందమూరి తారకరామారావు తిరపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి ని పురస్కరించుకొని తిరుపతికి చెందిన టిడిపి బీసీ సెల్ రాష్ట్ర నేత బిజె కృష్ణ యాదవ్ తో పాటు మరికొందరు తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్, భువన్ కుమార్ రెడ్డి లు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోయిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని, తిరుపతి నియోజకవర్గంలో ఆయనకు విడదీరాని బంధం ఉందని చెప్పారు. తెలుగుజాతి కీర్తిని ప్రపంచ నలుమూలల వ్యాపింపజేసిన కీర్తి ఆయనకే దక్కుతుందన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం , రాజకీయంగా అన్ని వర్గాల ప్రజలు ఎదగాలని ఆకాంక్షించిన మహనీయుడు అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం రాష్ట్ర అభివృద్ధికి పునాది అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పలువురు తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.