మన న్యూస్, నారాయణ పేట:- ఈనెల 31వ తేదీ శనివారం హైదరాబాద్ జలవిహార్ లో జరగనున్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ టీజేఎఫ్ 25వ వసంతాల సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను బుధవారం మహబూబ్ నగర్ ఎంపి.డికె.అరుణ,నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ , మార్కెట్ ఛైర్మెన్ శివారెడ్డి,సామాజిక కార్యకర్త రాజ్ కుమార్ రెడ్డి,మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కాంత్ కుమార్, ఆర్టీవో జిల్లా మెంబర్ రాజేష్ ఆ ఆష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో టి యు డబ్లూ జే ఎచ్ 143 జిల్లా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు అవుటి రాజశేఖర్, శ్రీధర్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.