మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు భూములు మా నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించాలని మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా చౌరస్తా నుంచి అంబేద్కర్ బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌కు భిక్షపతి కి వినతిపత్రం అందజేశారు.నిజాంసాగర్ ప్రాజెక్ట్ భూములను ఇతర నియోజకవర్గాలకు కేటాయించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి అచ్చంపేట్ శివారులో 680 ఎకరాల భూమి ఉందని.. అందులో ప్రస్తుతం జవహర్ నవోదయ,తెలంగాణ మోడల్ స్కూల్,పల్లె ప్రకృతి వనం, నర్సరీలు ఉన్నాయన్నారు.
మిగిలి ఉన్న భూమిని సైతం జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ నర్సింహ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ లు నర్సింలు, గుమస్తా శ్రీనివాస్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి,సిడిసి మాజీ చైర్మన్ పట్లోల్ల దుర్గారెడ్డి,నాయకులు గైని విఠల్,నాగభూషణంగౌడ్,మాజీ వైస్ ఎంపీపీ మనోహర్,రమేష్ గౌడ్, రాజారాం,మేకల విజయ్,అనిస్, శంకు లక్ష్మయ్య,వెంకటేశ్వర్లు, ప్రజాపండరి,ఒంటరి విఠల్ రెడ్డి,గంగి రమేష్,లోక్యా నాయక్,బంగ్లా ప్రవీన్, ఆకాష్,రపీక్,అహ్మద్ హుస్సేన్, ఆనంద్ కుమార్,వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.