మన న్యూస్, నెల్లూరు, మే 27: నెల్లూరు డైకస్ రోడ్ కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసంలో గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిసి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ప్రభుత్వం పెట్టిన అక్రమకేసు.. నిలవదని.. వారు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి కి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి,3,4,5,11, డివిజన్ ఇన్ చార్జ్ లు నారాయణ రెడ్డి,సందాని, సుబ్బారెడ్డి,మహేష్ యాదవ్, వైసిపి నాయకులు RK కృష్ణారెడ్డి,హరి బాబు, సింగం శెట్టి అశోక్,కొండయ్య, ప్రసన్న, పెంచలబాబు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.