Mana News :- ప్రత్తిపాడు (మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడుమండలం ధర్మవరం,ఏలూరు, ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి,కిర్లంపూడి మండలం జగపతినగరం,సింహాద్రిపురం గ్రామాల్లో సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు,బిజెపి నాయకులు సింగిలిదేవి సత్తిరాజు ఆధ్వర్యంలో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సత్య స్వాములు,మహిళా భక్తురాళ్లు అధిక సంఖ్యలో పాల్గొని సత్యదేవుని సంకీర్తనలతో గ్రామోత్సవంలో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు.అలాగే సత్యదీక్ష విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసిన ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబుని సత్యస్వాములు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నల్లమల్లి కృష్ణబాబు మాట్లాడుతూ నవంబర్ 22వ తేదీన అన్నవరం రత్నగిరి కొండపై స్వామి వారి మాలాధారణ చేసిన భక్తులకి ఉచితంగా సత్యనారాయణ మూర్తి వ్రత పూజ,అనంతరం పడిపూజ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు.నవంబర్ 23 వ తేదీ మాల వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధ గంగాపార్వతి,దాడిశెట్టి శేషగిరి, కంద నారాయణరావు,నానపల్లి కృష్ణ,మద్దాల దేవి తదితరులు పాల్గొన్నారు.