మన న్యూస్ ,నెల్లూరు ,మే 27:- నెల్లూరు వీఆర్సీ స్కూల్ లో జరుగుతున్న పనులను పర్యవేక్షించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి కుమార్తె పొంగూరు షరణి - తండ్రి ఆశయాలకు అనుగుణంగా షరణి ముందడుగు - స్కూల్ నిర్మాణ బాధ్యతలను తనకు అప్పజెప్పడంపై హర్షం వ్యక్తం చేసిన షరణి- P4 కింద స్కూల్లో చదివే 20 మంది విద్యార్థులను దత్తత స్వీకరణ- అధునాతన హంగులతో కార్పొరేట్ స్కూల్ తలదన్నేలా వీఆర్సీ హై స్కూల్ నూతన శోభగులు- జూన్ 12 నాటికి వి ఆర్ సి హై స్కూల్ ప్రారంభానికి సర్వం సిద్ధం - గడిచిన నాలుగు రోజులుగా నెల్లూరులోనే ఉండి వీఆర్సీ స్కూల్ పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి కుమార్తె షరణిపేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మహా సంకల్పానికి శ్రీకారం చుట్టారని మంత్రి కుమార్తె పొంగూరు షరణి తెలియజేశారు. నెల్లూరు విఆర్సీ హైస్కూల్లో శరవేగంగా సాగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె షరణి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ప్లే గ్రౌండ్, డైనింగ్ హల్ ఏర్పాట్లను పరిశీలించిన ఆమె పలు సూచనలు సలహాలు ఇచ్చారు. హైస్కూల్లోని ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ దగ్గరుండి సిబ్బందికి పలు సూచనలు ఇవ్వడంతో పాటు విద్యార్థులకు అనుగుణంగా తరగతి గదులను తీర్చిదిద్దడంలో మంత్రి నారాయణ కుమార్తె షరణి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా పొంగూరు షరణి మీడియాతో మాట్లాడుతూ జూన్ 12 న వీఆర్ హైస్కూల్ పునః ప్రారంభించాలని మా నాన్న నారాయణ సంకల్పించారని తెలిపారు. ఈ క్రమంలో ఎన్సీసీ పనులను వేగవంతంగా, నాణ్యతగా చేస్తుందని చెప్పారు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపయుక్తమైన స్కూల్ నిర్మాణ బాధ్యతను మా నాన్న తనకు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలతో విఆర్సీ స్కూల్ ని తీర్చిదిద్దేందుకు గడిచిన నాలుగు రోజులుగా నెల్లూరులోనే ఉంటూ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానని తెలియజేశారు. పేదపిల్లల కోసం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ చేపట్టిన మహా సంకల్పంలో భాగస్వామిని కావటం ఆనందంగా ఉందని పొంగూరు షరణి అన్నారు. వీఆర్సీ లో మా నాన్న చదివే రోజుల్లో సౌకర్యాలు పెద్దగా లేవని, అయితే ఇప్పుడు దేశంలోనే రోల్ మోడల్ గా నిబెట్టేలా విఆర్సీని సకల సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ స్కూల్ ద్వారా వేలాదిమంది నిరుపేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యని అదించబోతున్నామని చెప్పారు. విద్యార్థులకు సౌకర్యవంతంగా ట్రాన్స్పోర్ట్, భోజన వసతి కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని తెలియజేశారు. పర్యావరణపై అవగాహన కల్పించేందుకు హైడ్రో ఫోనిక్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్కూల్ లో చదివే వారిలో ఇరవై మంది విద్యార్థులను P4 కింద తాను దత్తత తీసుకోనున్నట్లు మంత్రి కుమార్తె షరణి వెల్లడించారు. విద్యార్థులకు అన్నిరకాల ల్యాబ్ లు , డాన్స్, మ్యూజిక్ , డ్రాయింగ్ రూం లు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.