మన న్యూస్ సాలూరు మే 27:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో చేపలు బజారులో కేజీకి 250 గ్రాములు తేడా ఉన్నందున 6 వేల రూపాయలు ఫైన్ విధించిన సానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ. పెద్ద మార్కెట్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం సానిటరీ ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో చేపలు, చికెన్ ధుఖణాలలో తనిఖీలు నిర్వహించారు. చేపలు విక్రయించే తూనికల్లో తేడాలు ఉన్నందున, అలాగే పరిశుభ్రత పాటించని వారిపై ప్రజా ఆరోగ్య దృశ్య మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ 6 వేల రూపాయలు అపరాధ రుసుము విధించారు. 10 కేజీల పాడైన కోడమాసాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాలుగు కేజీల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ప్లాస్టిక్ ని వాడకూడదని దుకాణాల యజమానులను హెచ్చరించారు. ఇది ప్రథమ తప్పుగా భావించి ఫైన్ తో సరిపెడుతున్నామన్నారు. ఇంకొకసారి ఇలా తూనికలో తేడాలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని దుకాణాల యజమానులను హెచ్చరించారు.