
కడప, { వెదురుకుప్పం } మన న్యూస్ , మే 27 :- ఈ రోజు కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన యువ నేతలు విశేషంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్, వాణిజ్య విభాగ అధ్యక్షుడు చాణక్య ప్రతాప్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్, చిత్తూరు పార్లమెంటరీ లీగల్ సెల్ అధ్యక్షుడు పూర్ణ చంద్ర నాయుడు, యువ నాయకులు సతీష్ నాయుడు, రాజాజీ, మారేపల్లి బూత్ కన్వీనర్ మురళీ, బొమ్మయపల్లి బూత్ కన్వీనర్ పవన్ కుమార్ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తామని, యువతను పార్టీకి మరింత సమీపించేందుకు తమ పూర్తి శక్తిని వినియోగిస్తామని వారు తెలిపారు. మహానాడు వేదికగా పలు కీలక నాయకులతో వారు సమావేశమై అభిప్రాయాలు పంచుకున్నారు.