మన న్యూస్, నెల్లూరు/ వెంకటగిరి :తిరుపతి జిల్లా వెంకటగిరిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై అక్రమ అరెస్టుపై.. వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తో కలిసి వైసిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ...... అబద్ధపు స్టేట్మెంట్ ఆధారంగా మైనింగ్ విషయంలో పోలీసులు గోవర్ధన్ రెడ్డి పై అక్రమ కేసు నమోదు చేశారని అన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి పై నమోదు చేసిన కేసు ఒక ఫాల్స్ కేసు అన్నారు. ఇదే మైనింగ్ విషయంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో ఆరోపణలు వస్తే.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు విచారణ జరిపి.. అలాంటిదేమీ లేదని తేల్చారని అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోవర్ధన్ రెడ్డి ని నిర్బంధించాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ ఫాల్స్ కేసు నమోదు చేశారని మండిపడ్డారు . ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి తో పాటు మరో ఇద్దరిపై కూడా అక్రమ కేసులు నమోదు చేశారని అన్నారు. ఎవరో ఒకరి వద్ద అబద్ధపు స్టేట్మెంట్ రికార్డు చేసి..దాని ఆధారంగా కాకాణి పై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని దుయ్యబట్టారు.ఇది ముమ్మాటికి అక్రమ కేశానని.. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేవని అన్నారు.ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని A4 గా చేర్చి.. కూటమినేతలు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.అనంతరం కాకాణి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి.. ఓటమినేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని భయపెట్టారు . అయితే ఈరోజు కాకాణి గోవర్ధన్ రెడ్డి ని అరెస్టు చేసిన పోలీసులు.. వారిని ఎక్కడ అరెస్టు చేశారు, ఎప్పుడు తీసుకువచ్చారన్న కనీస సమాచారాన్ని..ఇప్పటివరకు ప్రజలకు కానీ మీడియా కానీ తెలియజేయకపోవడం చట్ట విరుద్ధమన్నారు. మాజీ మంత్రిగా, శాసనసభ్యులుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించిన.. వ్యక్తిని ఈ విధంగా నిర్బంధించడం దుర్మార్గం అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ కనుసనల్లో సైదాపురంలో అడ్డగోలుగా మైనింగ్ జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్టులు చేయడం.. సిగ్గుచేటు అన్నారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చిన్న చిన్న నాయకులు చేసిన తప్పులకు.. ఇప్పుడున్న మంత్రులను ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలని భావిస్తే ఒక్కరు కూడా బయట తిరగలేరని హెచ్చరించారు.అక్రమ అరెస్టుల విషసంస్కృతి ఎన్నడు లేదని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ విష సంస్కృతిని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.ఇలాంటి రాజకీయాలు చేస్తే.. రేపు రాజకీయాలకు రావాలి సేవ చేయాలి అన్నవారికి.. ఎలాంటి సంకేతాలు వెళ్తాయో అర్థం చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాచుకోవడం దాచుకోవడమే పరి పాటిగా మారిందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులకు భయపడదని.. వాటన్నింటిని చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు.కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో..వాళ్ళు రోడ్ల మీదకు వస్తే నిలదీసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా..జూన్ 4వ తేదీను వెన్నుపోటు దినంగా పాటించాలని ఇప్పటికే మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఇచ్చి ఉన్నారని... అందుకు అనుగుణంగా జూన్ 4వ తేదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయని తెలిపారు. ఇదే ధోరణిలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తే..రాబోయే రోజుల్లో ప్రజలే ఆ పార్టీ కి బుద్ధి చెప్పే రోజు.. దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.