నారాయణ పేట, మన న్యూస్: - ఆన్ నోన్ నంబర్ల నుంచి ఫోన్ చేసి నేను మద్దూరు ఎస్.ఐ.ని అని చెప్పి డబ్బులు పంపించాలని మద్దూరు పట్టణ వ్యాపారస్తులను, జ్యూవెలరీ షాప్ ల యజమానులను కొందరు అపరిచిత వ్యక్తులు సైబర్ నేరగాళ్ళు భయ పెట్టిస్తున్నారని, ఆలాంటి ఆన్ నోన్ అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ పై పట్టణ వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలని మద్దూరు ఎస్.ఐ. విజయ్ కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు. కొన్ని రోజుల క్రితం నుండి నేను మద్దూర్ ఎస్సైని మాట్లాడుతున్నానని ఎస్ఐ పేరిట సైబర్ నేరగాళ్లు అన్నోన్ నెంబర్ నుండి కాల్ చేసి డబ్బులు పంపించాలని లేదంటే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని అలా డబ్బులు ఎవ్వరూ అడగరని ప్రతి ఒక్కరు గ్రహించాలని తెలిపారు. ఇకపై మద్దూరు ఎస్.ఐ. అంటూ ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే వెంటనే నేరుగా మద్దూరు ఎస్.ఐ. సెల్ 8712670407 కు, లేదా డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని మద్దూరు ఎస్.ఐ. కోరారు. ఇలాంటి ఆన్ నోన్ నంబర్ల కాల్స్ పై సైబర్ నేరగాళ్ళ పట్ల వ్యాపారస్తులు చాలా జాగ్రత్త గా ఉండాలని ఆయన సూచించారు.