నర్వ మండలం మన న్యూస్ మే 26 :- నర్వ మండల కేంద్రంలో బారాస అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. మండల పరిధిలోని జాండ్రగుట్ట దగ్గర 2023లో మహాత్మ జ్యోతిరావు పూలే వెనకబడిన రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయబడినది. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సహకారంతో 40/2 సర్వే నెంబర్ లో 5 ఎకరాలు భూమిని మంజూరు అయినది. ఆ స్కూలుకు జిల్లా కలెక్టర్ కూడా తనిఖీ చేశారు. భవన నిర్మాణ పనుల కొరకు స్థలం యొక్క ప్రొసీటింగ్ నెంబర్ E2/1835/2023 తేదీ 21/8/2023 న ప్రభుత్వము స్థలం మంజూరు చేసి స్థలం ఇవ్వనైనది. ఆ స్థలం ను 40/2 లో ఎమ్మార్వో పాఠశాలకు కేటాయించారు. కానీ ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు ఆ స్థలం ను జూనియర్ కళాశాలకు కేటాయించడం జరిగినది. కానీ కొందరి స్వార్ధ రాజకీయ నాయకులు మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలను లంకల గ్రామ శివారు సర్వే నెంబర్ 330 దగ్గర కేటాయించడం తో బాలికలకు లంకల శివారులో ఇబ్బందికి గురవుతుందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలను తిరిగి నర్వ గ్రామ చివరకు మళ్లీ తీసుకురావాలని ఆయన తెలిపారు. నేడు జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కు నర మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి మరియు నాయకులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. 2021 నవంబర్లో గ్రామ ప్రజల సమక్షంలో జాండ్రగుట్ట దగ్గరని బాలికల పాఠశాల నిర్మాణం చేయాలని తీర్మానం చేశారని డాక్టర్ శంకర్ తెలిపారు. మళ్లీ పునర్: ఆలోచన చేసి ఆ బాలికల పాఠశాలను నర్వ శివారులో నిర్మాణం చేయాలని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి కోరారు.