మన న్యూస్, నెల్లూరు మే 25: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్, నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ.........మైనింగ్ విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కి.. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎలాంటి సంబంధం లేదు. ఎవరో ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ని అరెస్టు చేయడం దుర్మార్గం.మైనింగ్ విషయంలో నమోదైన కేసును కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే న్యాయస్థానంలో సవాలు చేసినప్పటికీ.. ఆ కేసుకు బెయిల్ రాకుండా అధికార పార్టీ అడ్డుకోవడం సోచనియమన్నారు అయితే ఈరోజు కాకాణి గోవర్ధన్ రెడ్డి ని అరెస్టు చేశామని పోలీసు ధ్రువీకరిస్తున్నారని.. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు గోవర్ధన్ రెడ్డి గని అరెస్టు చేస్తే..ఎక్కడ ఉంచారు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న కనీస సమాచారం కూడా తెలియకుండా గోప్యంగా ఉంచడం చట్ట విరుద్ధమన్నారు.మాజీ మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు కనీస సమాచారం ఇవ్వాలన్న బాధ్యత పోలీసు డిపార్ట్మెంట్ పై లేకపోవడం బాధ్యత రాహిత్యమేనన్నారు.ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం కాకాణి గోవర్ధన్ రెడ్డి కి అండగా నిలుస్తుంది అని తెలిపారు.ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఈ విధంగా అక్రమ కేసులు నమోదు చేయడం జరగలేదని.. ఇదేవిధంగా కొనసాగుతూ పోతే.. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు.. ఇదే విధంగా వ్యవహరిస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా.. బయట తిరగలేరన్న విషయాన్ని అధికార పార్టీ గుర్తుపెట్టుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని.. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు.ఇలా కక్ష రాజకీయాలు కొనసాగిస్తే.. రేపు రాజకీయాల్లోకి రావాలి సేవ చేయాలి అనుకునే వారు కూడా.. రాజకీయాలకు దూరమవ్వాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిపై పెట్టిన అక్రమ కేసు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధంగా పోరాటం చేస్తుందన్నారు.ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి క్లీన్ చిట్ తో బయటికి వస్తారని నమ్మకం తమకుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమాలు, దుర్మార్గాలను.. రాబోయే రోజుల్లో ప్రజల దృష్టికి తీసుకువెళ్లి.. ప్రజల ముందు వారిని దోషులుగా నిలబెట్టే రోజు వస్తుందన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ.. ఇప్పటివరకు ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని.. ఈరోజు వారు ప్రజల ముందుకు వస్తే ప్రజలు నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.ఈరోజు ప్రతిపక్ష పార్టీ నేతలు అధికార పార్టీ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో వారిపై అక్రమ కేసులు పెట్టి ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇది అప్రజాస్వామ్యకం అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.