మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులో గల ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ, ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా బోనాల పండుగను గ్రామ ప్రజలు బోనాల పండగ ఘనంగా నిర్వహించారు.పెద్ద ఎత్తున మహిళలు ప్రతి ఇంటి నుండి మహిళలు అమ్మవారికి బోనాలను నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్లతో గ్రామ శివారులోని గల అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలను బోనాలలో ఉంచి అమ్మవారికి పసుపు, కుంకుమ,చీర సారెలు సమర్పించి గా జులు ధరింపజేసి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బో నాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.తమగ్రామాన్ని ప్రజలను పాడిపంటలను చల్లగా చూడు తల్లి ప్రతి యేటా ఇదే మాదిరిగా అమ్మవారికి బోనాలు సమర్పిం చిముక్కులనుచెల్లించుకుంటామని వారు పేర్కొన్నారు.ఈ వేడుకకు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముత్యాల పోచమ్మ.నల్ల పోచ మ్మ, ఎల్లమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మె ల్యేను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ ఎల్లమ్మ అమ్మవార్ల దయతో వర్షాకాలంలో సమృద్ధి గా వర్షాలు కురిసే పాడిపంటలు పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి,గుర్రపు శ్రీనివాస్, వకీల్ రాంరెడ్డి, మల్లయ్య గారి ఆకాష్ ,గంగి రమేష్, ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక గ్రామస్తులు తదిత రులు ఉన్నారు.