మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం విత్తనాలను రాయితీ పై ఇస్తుందన్నారు.30 కిలోల బస్తా ధర 2137.50 రూపాయలని ఇట్టి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్, సొసైటీ సీఈవో సంగమేశ్వర్ గౌడ్,తదితరులు ఉన్నారు.