మన న్యూస్,తిరుపతి : కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు ఆదివారం నూతన గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దంపతులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి యాదవ్, ఆమె భర్త బీసీ సంఘర్షణ సమితి నేత రామచంద్ర యాదవ్ లు కలసి శ్రీవారి చిత్రపటాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పుష్పావతి యాదవ్ నారా భువనేశ్వరి ని శాలువాతో ఘనంగా సత్కరించారు.