మన న్యూస్ , నెల్లూరు ,మే 25:కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి తాత పోలంరెడ్డి వెంకురెడ్డి ద్వితీయ వర్ధంతి కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి , కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు పాల్గొని నివాళులు అర్పించారు.వెంకురెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. పోలంరెడ్డి వెంకురెడ్డి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆయన కుటుంబానికి సంఘీభావం తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తో కొద్దిసేపు మాట్లాడారు.