మన న్యూస్ ,నెల్లూరు ,మే 25:నెల్లూరు రాంజీ నగర్ ఆఫీస్ లో వైఎస్ఆర్సిపి సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని 9 వ డివిజన్ వైసిపి నాయకులు, కార్యకర్తలు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా వారు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో డివిజన్ సమస్యలపై చర్చించారు.డివిజన్లో పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా ముందుండి తామంతా ఏకతాటిపై పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.......డివిజన్ లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ .. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. వైఎస్ఆర్సిపి బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న..భావన ప్రతి ఒక్కరిలో కలుగజేయాలన్నారు.కష్టకాలంలో పార్టీ కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.