మన న్యూస్, నెల్లూరు,మే24: ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి పార్టీ కోసం కష్టపడే వారికే పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. మెడికల్ కాలేజీలోని క్యాంపు కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్చార్జిలు ముఖ్య నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. సిటీ పరిధిలోని ఐదు దేవాలయాల కమిటీ చైర్మన్ లు, పాలకమండలి సభ్యుల ఎంపికపై కసరత్తు చేశారు. అందరి అభిప్రాయాలను తీసుకొని.. పారదర్శకంగా పదవుల్లో ప్రాధాన్యత ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అన్ని కులాలు తనకు సమానమేనని వ్యాఖ్యానించిన మంత్రి నారాయణ. పదవుల కేటాయింపుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తానన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా మంచి పదవులే వస్తాయని భరోసా ఇచ్చారు. పదవులు వచ్చిన వారు దాన్ని అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జడ్పిటిసి విజేతారెడ్డి, టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, నగర అధ్యక్షులు మామిడాల మధు.. టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు .