ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా…. వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి
ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ఎస్ఆర్ పురంమండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి యువ నాయకుడు శ్యామ్ ఆధ్వర్యంలో మండలం నుంచి దాదాపు 50 కారులతో గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి కి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో పూలమాలవేసి దుశ్యాలువ తో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ… నాకు ఘన స్వాగతం పలకడానికి కృషిచేసిన యువ నాయకుడు శ్యామ్ ను అభినందించారు. రాష్ట్ర రాజకీయాల్లోకి యువ రక్తానికి పెద్దపీట వేస్తున్నామని…. నేటి యువత రేపటి వైఎస్ఆర్సిపి భవిష్యత్తు నాయకులని అన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకం దౌర్జన్యం అన్యాయాలని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి…. వారు చేసే మోసాలని ప్రజలకు వివరించాలన్నారు. వైఎస్ఆర్సి నాయకులు కార్యకర్తలు లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎవరు ఆధర్యం పడకండి మీకందరికీ వైఎస్ఆర్సిపి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. యువ నాయకుడు శ్యామ్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి అభిమానులు, యువకులు అందరూ శ్యామ్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 100 వాహనాలతో భారీ కాన్వాయ్ తో పుత్తూరులోని తమ స్వగృహానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు , యువకులు అభిమానులు కొత్తపల్లి శ్యామ్ టీం పాల్గొన్నారు.