
మన న్యూస్ సాలూరు మే 24:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గ్రామస్థాయి ప్రకృతి వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేసి ఈ ఖరీఫ్ సీజన్లో అమలు చేసి ఎంతమందిని ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్ళించాము గుర్తించి వారిని సత్కరించాలని సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ అన్నారు. మాతమూరు గ్రామంలో సిఆర్పి తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఖరీఫ్ ప్రణాళిక సమావేశంలో భాగంగా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సత్వర సేవలను అందించి రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్ళించాలని ముఖ్యంగా వరి, కూరగాయల పంటలపై దృష్టి సారించి పూర్తిస్థాయిలో ప్రకృతి సేద్యం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని రైతులకు కూడా ఈ విషయమై సిబ్బందికి సహకరించి ముందుకు రావాలని కోరారు. అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఖర్చులు పెట్టే కంటే ముందుగానే జాగ్రత్త పడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య ఎంటి యశోదమ్మ మాట్లాడుతూ ప్రకృతి సేద్య 9 సార్వత్రిక సూత్రాలను రైతులు పాటించడం ద్వారా పూర్తిస్థాయి ప్రకృతి ఫలితాలను పొందవచ్చని తెలిపారు. పంటల వ్యర్ధాలను తగులు పెట్టకూడదని పంటల వ్యర్ధాలలో అనేక పుష్కలు ఉంటాయని భూమిలో కలియదు ఉండడం ద్వారా తర్వాత పంటకు పోషకాలు అందించవచ్చని అలాగే సేంద్రియ పదార్థాన్ని పెంచవచ్చని తెలిపారు. అనంతరం గ్రామ వ్యవసాయ సహాయకులు దినేష్ సాగుతారు సాగు హక్కు పత్రాలు తప్పనిసరిగా పొందాలని అన్నదాత సుఖీభవ పంటల భీమా పంట నష్టపరిహారాలు పంట రుణాలు వంటివి పొందవచ్చని తెలిపారు. అనంతరం రైతులకు మొక్కజొన్న పంటపై వచ్చే కత్తెర పురుగు నివారణ కోసం మహిళా రైతు మర్రాపు త్రివేణి తయారుచేసిన అగ్ని ఆస్త్రాన్ని పనిచేసే విధానాన్ని రైతులకు వివరించారు. అనంతరం ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని కోరుతూ పలువురు రైతులను సాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు ఐ సి ఆర్ పి కుమార్ రైతులు పాల్గొన్నారు.