
గొల్లప్రోలు మే 24 మన న్యూస్. :- గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామ పరిదిలో ఉన్న అడవి పుంత రోడ్డు తాండ్ర ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్రమన పై ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిలభారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం తహసిల్దార్ కి శనివారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏపీ ఆర్ సి ఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, ఏఐఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు లు మాట్లాడుతూ రైతులు నిరంతరం రాకపోకలు సాగించే అడవి పుంతరొడ్డును అక్రమంగా ఆక్రమించుకోవడానికి తీవ్రంగా ఖండించారు. పుంతలో కరెంట్ ట్రాన్స్ పార్మర్ ఏర్పాటుచేసి, రోడ్డుపై కలప వేస్తున్నారన్నారు.అలాగే మామిడి తాండ్ర నుండి వచ్చె వ్యర్థాలను పుంతలో మరియు రోడ్డు మీద వేస్తున్నారన్నారు..* దీని వల్ల ఆ పుంతలో వెల్లే రైతులు వర్షాల పడే టైంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. కావున ప్రజల,రైతుల బాదలను గర్తించి తక్షణమే అడవి పుంతను సర్వే చేయించి ఆక్రమణలు తొలిగించాలని అలాగే సంబంధిత మామిడి తాండ్ర ప్యాక్ట్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. లేనిపక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు(వి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడితి సతీష్, ఏఐఎఫ్టియు జిల్లా నాయకులు డి. నారాయణమూర్తి, గుడాల చార్లెస్, బల్ల సోమరాజు తదితరులు పాల్గొన్నారు.