మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్, మల్లూరు సహకార సంఘాల్లో జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీ పై జీలుగ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ పథకంలో భాగంగా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్, మల్లూరు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 30 క్వింటాళ్ల చొప్పున జీలుగ విత్తనాలు వచ్చాయన్నారు.ఈ విత్తనాలను 50% రాయితీ పై రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఒక బస్తా రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో చల్లుకోవాలన్నారు.విత్తనాల కోసం వచ్చే రైతులు తప్పకుండా పట్టా పాస్ పుస్తకం,ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పించి సహకార సంఘాల ద్వారా జీలుగ విత్తనాలు పొందాలన్నారు. 30 కిలోల ధర 4275 రూపాయలు ఉంటె రాయితీపై 2137.50 రూపాయలు చెల్లించి ఒక బస్సా రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో చల్లుకోవచ్చు అని తెలిపారు.
జీలుగ పంట ప్రయోజనాలు
పొలంలో జీలుగను కలియదున్ని తర్వాత అవి నేలకు, ఆపై వేసే పంటలకు విశేషమైన లాభాలు అందిస్తుంది.ప్రధాన పంటకు ముందస్తుగా నేలను తయారు చేస్తుందిజీలుగ సాగు వల్ల మూడు టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. మొక్కలకు రెండు శాతం నత్రజని,సూపర్ ఫాస్పేట్ను అదనంగా అందిస్తాయి.జింక్, మాంగనీసు, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మధాతువులను పంటకు చేకూర్చుతాయి.
నేలలో కరగని మూలకాలను పంటకు అనుకూలంగా మార్చుతాయి
నీటి నిల్వ సామర్థ్యం పెంచుతాయి.
నేల సహజ మిత్రులైన వానపాముల ఉత్పత్తికి దోహదం చేస్తాయి.
లెగ్యూ జాతికి చెందిన మొక్క కావడంతో వేర్లతో నత్రజని స్థిరీకరణ అధికంగా ఉంటుంది.
తుంగ, గరక వంటి కలుపు మొక్కలను అడ్డుకుంటుంది.
ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.