
మన న్యూస్ ,నెల్లూరు రూరల్ : *చాలా జోష్ గా ముమ్మరంగా సాగుతున్న మున్సిపల్ డివిజన్స్ ఆత్మీయ సమావేశాలు.నెల్లూరు రూరల్ నియోజకవర్గం,33వ డివిజన్ మరియు 34వ డివిజన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో శుక్రవారం సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతరెడ్డిపాళెంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నివాసం నందు 33వ డివిజన్ మరియు 34వ డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆనం విజయకుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ..........నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లో కష్టపడి పని చేసే ప్రతి నాయకుడుకి ప్రతీ కార్యకర్త కి వారికి తగ్గ పదవులు కచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.ఇప్పటికే మన రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో,జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో,డివిజన్ స్థాయిలోను అనుబంధ విభాగాల్లో ముఖ్య నాయకులు అందరికి పదవులు ఇవ్వడం జరిగింది.ఇంకా జిల్లా కమిటీ లో నగర కమిటీ లో ప్రతి నాయకులుకి ప్రతి కార్యకర్తకి పదవులు ఇవ్వడం జరుగుతుంది అని,ప్రతి ఒక్కరితో నేను మీలో ఒక్కడిగా మీకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో పార్టీలో ఉండే ప్రతి నాయకులుని ప్రతి ఒక్కరినీ సమన్వయ పరిచి ఒకే కుటుంబానికి చెందిన విదంగా అందంరం కలిసి మెలసి నడుద్దాం, అని పెద్ద చిన్న ప్రతి ఒక్కరితో స్నేహ పూర్వకంగా ఉంటాను అని నన్ను మీ స్నేహితుడు గా భావించండి మీ అందరికీ పదవులు వచ్చే ఏర్పాటు చేస్తామని,పార్టీ పరంగా మీ ప్రతి సమస్యని నా సమస్య గా భావించి మీకు అండ దండు గా ఉంటానని తెలియజేశారు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 33వ డివిజన్ ఇంచార్జ్ గా అశోక్ కుమార్ (దాసు) ని నియమించారు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 34వ డివిజన్ ఇంచార్జ్ గా షేక్ ఇలియాజ్ ని నియమించారు.ప్రతి ఒక్క నాయకుడు మరియు ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, 37 డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాస్ రావు (RSR),రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రెటరీ శ్యామ్ సింగ్, అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి లావణ్య, నెల్లూరు రూరల్ నియోజకవర్గ, ఎంప్లాయస్ & పెన్షనర్స్ విభాగ అధ్యక్షుడు కనకట్ల మోహన్ రావు ముదిరాజ్, సాంస్కృతిక విభాగ అధ్యక్షురాలు శ్రీమతి శారద, క్రిస్టియన్స్ వింగ్ అధ్యక్షుడు దాసరి రాజేష్, వాణిజ్య విభాగ అధ్యక్షులు సతీష్, 27 డివిజన్ ఇంచార్జ్ మస్తాన్ రెడ్డి,41 డివిజన్ నాయకులు శ్రీనివాసులు,38 డివిజన్ నాయకులు అలీమ్,26వ డివిజన్ నాయకులు పెంచలయ్య, 33వ డివిజన్ నాయకులు గృహలక్ష్మి, అబ్దుల్ గని, శ్రీనివాసులు, వివరం అశోక్, ధనవేలు 34వ డివిజన్ నాయకులు రఫీ, బి.రాజారత్నం, విజయ్, సందాని, శ్రీను, మహేశ్వరి, రత్నం 33వ డివిజన్ మరియు 34వ డివిజన్ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

