
మన న్యూస్, నెల్లూరు, మే 23 :*2029లో వైసీపీకి అంత్యక్రియలే*టీడీపీలో కొనసాగుతున్న ఎన్టీఆర్ బ్రాండ్.*దేశానికే దిక్సూచిగా చంద్రబాబు నాయుడి విజన్.*ఏపీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం విషయంలో తాత, తండ్రికి దీటుగా లోకేష్ బాబు.*మూడు తరాలతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది.*పెద్దాయన ఎన్టీఆర్ ను భారతరత్నతో గౌరవించాలి.నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ లో శుక్రవారం నిర్వహించిన టీడీపీ జిల్లా మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ....మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం అని అన్నారు.ఆ రోజుల్లో హైదరాబాద్ లో నిర్వహించిన మహానాడుల్లో నాంపల్లి నుంచి నిజాం గ్రౌండ్స్ వరకు ర్యాలీగా నడిచిపోయిన రోజులు ఎప్పటికీ గుర్తుంటాయి అని తెలిపారు.పెద్దాయన ఎన్టీఆర్ ఆశీస్సులతో దూబగుంట రోశమ్మ బాటలో సారా వ్యతిరేక ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా పాల్గొన్నాం..అఖిలపక్ష సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ గా వ్యవహరించాను అని అన్నారు.ఉమ్మడి ఏపీలోని 22 జిల్లాలో సారా వేలం పాటలు నిర్వహిస్తే, ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం వేలం జరగకుండా విజయవంతంగా అడ్డుకున్నాం అని అన్నారు.నెల్లూరు మహిళల పోరాట పటిమ చూసిన ఎన్టీఆర్ వీఆర్సీ మైదానం నిర్వహించిన సభ సందర్భంగా సారా నిషేదంతో పాటు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకున్నారు అని అన్నారు.తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఆ బ్రాండ్ కొనసాగుతూనే ఉంది అని అన్నారు.విజన్, హైటెక్ సిటీ, ఐటీ, అభివృద్ధి, పరిశ్రమలు అంటేనే నారా చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తారు అని అన్నారు.గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఐటీ అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడిని ఫాలో అయ్యానని పీఎం నరేంద్రమోదీ చెప్పడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం అని అన్నారు.ఇప్పుడు మూడో తరంలో యువ నాయకుడు నారా లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేసే అవకాశం కూడా మాకు దక్కింది అని అన్నారు.ఇటీవల నెలకొన్న యుద్ధపరిస్థితుల్లోనూ నారా లోకేష్ బాబు కుటుంబానికి నరేంద్ర మోదీ రెండు గంటల పాటు ఆథిత్యమివ్వడం గొప్ప విషయం అని అన్నారు.లోకేష్ బాబులోని నాయకత్వ లక్షణాలు, పోరాటపటిమ, అభివృద్ధి కోసం పడుతున్న తపనను మోదీ గుర్తించారు అని అన్నారు.జగన్ రెడ్డి పాలన సాగిన ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనమైపోయింది అని అన్నారు.జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదం అని అన్నారు.2029 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీకి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు అని అన్నారు.రూ.60 కోట్ల బోఫోర్స్ కుంభకోణం, రూ.60 కోట్ల 2జీ స్కామ్ తో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కోల్పోయింది అని అన్నారు.రూ.150 కోట్ల లిక్కర్ స్కామ్ తో ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీలు, ముఖ్య నాయకులు జైళ్లలో మగ్గిపోయారు అని అన్నారు.ఏపీలో వైసీపీ హయాంలో రూ.3200 కోట్ల మద్యం స్కామ్ జరిగిందని సిట్ పక్కా ఆధారాలతో తేల్చింది అని అన్నారు.అధికారిక విక్రయాలతో రూ.3200 కోట్ల అవినీతి జరిగితే, అనధికారికంగా జరిపిన విక్రయాల రూపంలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగింది అని అన్నారు.మద్యం స్కామ్ లో అడ్డంగా బుక్కయిపోయిన పరిస్థితుల్లో మన గురించి జగన్ రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరం అని అన్నారు.ఉర్సా కంపెనీకి విశాఖలో 50 ఎకరాలను 90 పైసల చొప్పున ఇడ్లీ, వడ కంటే తక్కువకు ఇచ్చారని పచ్చి అబద్ధాలు చెప్పాడు అని అన్నారు.ఆ కంపెనీకి 56.30 ఎకరాలకు ఎకరా రూ.50 లక్షల చొప్పున, 3.50 ఎకరాలను ఎకరా రూ.కోటి చొప్పున కేటాయించారు అని అన్నారు.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక కంపెనీలకు ఉచితంగా భూకేటాయింపులు చేశారు అని అన్నారు.ఉద్యోగ, ఉపాధి, పరిశ్రమలు, పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని పారిశ్రామికవేత్తలను పిలిచి ఉచితంగా భూములిచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి అని అన్నారు.రూ.కోటి, రూ.50 లక్షల చొప్పున భూములు కేటాయిస్తే సీఎంగా పనిచేసి వ్యక్తి ఇడ్లీ, వడలతో పోల్చి అసత్య ప్రచారాలు చేయడం దురదృష్టకరం అని అన్నారు.ఉర్సా కంపెనీకి ఎకరా రూ.1కి ఇచ్చివుంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, జగన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని సవాల్ విసిరాను అని అన్నారు.ఈ రోజు దేశంలోని ఏ మద్యం కంపెనీ అయినా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం ఏపీలో ఉంది.. అని అన్నారు.గతంలో పరిస్థితి ఏంటి...వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడి విక్రయించిన నాసిరకమైన మందు తాగి ఎందరో ప్రాణాలు కోల్పోయారు..వేలాది మంది అనారోగ్యం పాలయ్యారు అని అన్నారు.అరాచకాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యక్తి ఈ రోజు గంటల తరబడి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు అని అన్నారు .త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వైసీపీ హయాంలో మాదిరిగా అరాచకాలు చేయబోం అని అన్నారు.జనంలో ఉంటూ, జనం కోసం పనిచేస్తూ స్థానిక సంస్థల్లో ఘనవిజయం సాధిద్దాం అని అన్నారు.2029 ఎన్నికల్లో తిరిగి ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడిని మరో సారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదిద్దాం అని అన్నారు.పేదలకు కూడు, గూడు, గుడ్డ ఉండాలని తపించిన పెద్దాయన ఎన్టీఆర్ ను భారతరత్నతో గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.




