మన న్యూస్,హైదరాబాద్ మే 23,ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రావాలని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు చెప్పండని కోరారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా? అని ప్రశ్నించారు. మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామ. ని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. ఏ రోజు తాను సీఎంగా అహంకారానికి పోలేదని చెప్పారు.మీరు అండగా ఉంటే ఇద్భుతాలు చేస్తామని... ప్రపంచంలో తెలంగాణని గొప్ప రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్దే కాంగ్రెస్ ప్రభు త్వ లక్ష్యం.రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఒక్క సారి కాదు 50 సార్లు కలుస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో రూ.494.67 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తాను జడ్పీటీసీ స్థాయి నుంచి వివిధ పదవులు అలంకరించానని, అధికారంలో లేకపోయినా నిత్యం జనంలో ఉండి పనిచేశానని,మాజీ ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు మాత్రం అధికారంలో పోగానే ఫాంహౌజ్ కే పరిమితం అయ్యారని విమర్శించారు. తాను రాజకీయ విమర్శలు చేయదలచు కోలేదని,కేసీఆర్ తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అసెంబ్లీకి వచ్చి తమ ప్రభుత్వానికి సూచనలు.
సలహాలు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమించిన 1200 మంది అమరులయ్యారని,10 ఏండ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని,కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు,లక్ష వరకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవే కాకుండా 3 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులతో పా రిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నామని, పరిశ్రమల రాకతో ప్రత్యేక్షంగా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. నిమ్స్ లో హుండాయ్ సంస్థకు 450 ఎకరాలు కేటాయించామని, త్వర లోనే సంస్థ కార్ల ఉత్పత్తినిప్రారంభించనున్నదాని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.గేట్ వే ఆఫ్ ఇం డస్టీగా జహీరాబాద్ మారస్తున్నదన్నారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తు న్నామని, గతంలో కేసీఆర్ లాగా కేంద్రంతో సఖ్యత గా ఉండేవారు కాదని, చెరువు మీద అలిగి కడుక్కో కపోతే మనకే వాసన వస్తుందని విమర్శించారు.
నిమ్ భూ నిర్వాసితుకుల పరిహారం పెంచాం,12500 ఎకరాల్లో ఏర్పాటైన నిమ్ లో చాలా మంది భూములు కోల్పోయారని వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారం లోవచ్చిన తరువాత నిష్టే అభివృద్ధి కుంటుపడిందని స్థానిక నాయకులు తనవద్దకు వచ్చి చెబుతే భూ సేక రణలో వేగం పెంచామని చెప్పారు. గత ప్రభుత్వం భూములు కోల్పోయిన ఎస్సీలకు రూ.2.50 లక్షలు, ఇతరుల సీలింగ్ భూమిక్ రూ. 5 లక్షలు మాత్రం చెల్లించిందని తాను అధికారులను పిలిచి పేదలకు న్యాయం చేయాలని ఆదేశించిన సందర్భాన్ని సీఎం గుర్తుచేశారు. అంతే కాకుండానిమ్లో మొత్తం 5612 కుటుంబాలు భూములు కోల్పోయాయని, ఆకుటుం బాలకు వారు కోరుకున్న చోట ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ మొత్తం కుటుంబాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించి అందరికీ ఇండ్లపట్టాలు అందించే బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. అందుకోసంతగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వల్లూరి
క్రాంతి. ఇతర అధికారులను ఆదేశించారు.
*చరిత్ర మెదక్ ను మరచిపోదు....*
మెదక్ నుంచే ఎంపీగా స్వర్గీయ ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించి దేశ ప్రధానిగా సేవలు అందించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడే 1984 లో ఆమె ఆకరి రక్తం బొట్టు భూమిలో వదిలి పెట్టారన్నారు. మెదక్ ప్రజలు నాటి ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కు అండగా నిలబడుతూ వస్తున్నారన్నా రు. ఇందిరమ్మ హయాంలోనే మెదక్ కు ఇక్రిశాట్,ఓడీఎస్, బీడీల్, బీహెచ్ ఈఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయన్నారు. ఇందిరాగాంధీతోపాటు బాగారెడ్డి, ఈశ్వరీబాయి, గీతారెడ్డి ఇలా ఎందరో మెదక్ గుర్తుండిపోయే నాయకులున్నారన్నారు. నిమ్స్ ను జహీరాబాద్ కు గీతారెడ్డి తీసుకువచ్చార ని, ఈ ప్రాంతం అభివృద్ధిలో వారి పాత్ర గొప్పదని సీఎం గుర్తు చేశారు.
*బసవేశ్వరుడు బాటలో కాంగ్రెస్ పాలన*
విశ్వగురువు బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ, ఆయన చూపినబాటలో తెలంగాణ ప్రభుత్వపాలన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని సీఎం. అవిష్కరించారు. రాహుల్ గాంధీ 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ యాత్రలో భాగంగా బసవేశ్వరుడి సూచనల మేరకే కాంగ్రెస్ జనగణనతో కులగణన చేయాలని రాహుల్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సామాజిక వర్గాలకు భాగస్వామ్యం కల్పించమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ కులగణన చేపట్టింద న్నారు. బసవేశ్వరుడి సందేశమే ఇందిరమ్మరాజ్యా నికి సూచిక భావిస్తున్నామన్నారు. వారి సందేశాన్ని తీసుకుని సామాజిక న్యాయం అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకుసా
గుతామని రేవంత్ రెడ్డి అన్నారు. అన్నదాతకు అండగా ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉన్నదని సీఎం చెప్పారు. రూ.26 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, ఎకరాకు రూ.5 వేలుగా ఉన్న రైతు భరోసాను రూ.6వేలకు పెంచామని, భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే రూ.12 వేలు అందిస్తున్నాం. వరి వేస్తే ఉరే అని గత ప్రభుత్వ పెద్దలు చెబితే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లు పండిస్తున్న రైతులకు రూ.500 బోనస్ ఇస్తుందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఆడబిడ్డల కోసం గత 18 నెలల కాలంలో ఉచిత బస్సు ప్రయాణానికి రూ.5500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గత ఏడాదిలో
స్వయం సహాయక సంఘాలకు రూ.20వేల కోట్ల బ్యాంకు లింకేజీలు ఉంటే ఈ ఏడాది రూ. 21 వేల కోట్ల లింకేజికి పెంచామని సీఎం రేవంత్ రెడ్డి వె ల్లడించారు. రానున్న నాలుగేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆర్టీసీ బస్సులను, పెట్రోల్ బంకులను అమ్మా ఆదర్శ పాఠ శాలల నిర్వహణ, నిత్యావసరాల సరుకుల పంపిణీ వంటి వాటిలో మహిళల బాధ్యతలు పెంచి వారిచే నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.
నిండుమనుసుతో దీవించండి...
రాష్ట్ర ప్రభుత్వ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడానికి కృషి చేస్తున్నదని, ఈ ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. యువత,బీ నిరుద్యోగులకు సర్కార్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, ఎప్పుడూ అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎవరు ఏమను కున్నా సోనియాగాంధీ నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో వార్డు మెంబర్ మొదలుకుని ఇతర స్థానాలను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం. చేశారు. పరిశ్రమలు తీసుకువచ్చి, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామని, వన్ ట్రిలియన్ ఎకనామీ రాష్ట్రంగా, తెలంగాణను నెంబర్ 1 గా తీ ర్చిదిద్దుతామని సీఎం అన్నారు. టోక్కో, న్యూయార్క్ సిటీలకు సరసనా భారత్ ప్యూచర్ సిటీ తెలంగాణ కానున్నదని అంతవరకు నిద్రపోనున్నారు. ఇదిలా ఉండగా జహీరాబాద్ చెక్కల పరిశ్రమ ఏర్పాటు కోసం నిమ్ లో 100 ఎకరాల కేటాయిస్తామని, నిధులు కూడా అందిస్తామని. సింగూరు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.వేం నరేందర్ రెడ్డి,కొండా సురేఖ, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సంజీవరెడ్డి,నీలం మధు ముదిరాజ్,ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,
ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదిత రులు పాల్గొన్నారు.