
మన న్యూస్ సాలూరు మే 23 : పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం మరిపల్లి గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తిర్చి దిద్దుతామని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సీఐ జి. దాస్ అన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నవోదయం 2.0 లో భాగంగా శుక్రవారం ఉదయం మండలంలోని మరిపల్లి గ్రామం సచివాలయ కార్యాలయంలో మరిపల్లి సర్పంచ్ తొత్తడి నారాయణమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరిపల్లి గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని వారంతా తీర్మానం చేసారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ ఎస్సై ఎం. రవి ప్రసాద్, ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న అధికారి వసీం అక్రం, పంచాయతీ సెక్రటరీ సుమలత, వీఆర్వో జగన్మోహన్రావు తో పాటు తదితరులు పాల్గొన్నారు.