Mana News, నెల్లూరు: వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పాలన రాష్ట్రాన్ని సర్వనాశన దిశగా నడిపిందని, 2029 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అంతిమ వీడ్కోలు పలకనున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా టీడీపీ మహానాడు సందర్భంగా వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ – “మూడు తరాల తెలుగు రాజకీయాలకు మేము ప్రత్యక్ష సాక్షులం. ఎన్టీఆర్ ఆశయాలకు నాంది పలికిన చంద్రబాబు నాయుడు, ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ నాయకత్వం మాకు గర్వకారణం” అని తెలిపారు. ఎన్టీఆర్ బ్రాండ్ ఎనలేని శక్తి : టీడీపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు చిరస్మరణీయమని, ఆ బ్రాండ్ ఇప్పటికీ పార్టీకి నూతన ఊపునిచ్చిందని పేర్కొన్నారు. “హైదరాబాద్ నాంపల్లి నుండి నిజాం గ్రౌండ్స్ వరకు జరిగిన మహానాడుల్లో పాల్గొన్న రోజులే నాకు గుర్తొస్తున్నాయి,” అన్నారు. సారా వ్యతిరేక పోరాటంలో సోమిరెడ్డి పాత్ర : “దూబగుంట రోశమ్మ బాటలో నడిచి, రాజకీయాలకు అతీతంగా సారా వ్యతిరేక ఉద్యమానికి నడిపించాను. అఖిలపక్ష సారా వ్యతిరేక కమిటీ కన్వీనర్‌గా పని చేశాను. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వేలం పాటలు జరిగితే, నెల్లూరులో మాత్రం జరగకుండా అడ్డుకున్నాం,” అని గర్వంగా గుర్తు చేసుకున్నారు.“దూబగుంట రోశమ్మ బాటలో నడిచి, రాజకీయాలకు అతీతంగా సారా వ్యతిరేక ఉద్యమానికి నడిపించాను. అఖిలపక్ష సారా వ్యతిరేక కమిటీ కన్వీనర్‌గా పని చేశాను. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వేలం పాటలు జరిగితే, నెల్లూరులో మాత్రం జరగకుండా అడ్డుకున్నాం,” అని గర్వంగా గుర్తు చేసుకున్నారు.వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు: వైసీపీ పాలనలో రూ.3,200 కోట్ల మద్యం స్కామ్, భూకుంభకోణం, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసిన నాసిరక మందుల విక్రయం వంటి ఉదంతాలపై తీవ్ర విమర్శలు చేశారు. "ఈ రాష్ట్రంలో మద్యం కంపెనీలకు స్వేచ్ఛ ఉన్నా, ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టే పాలన వైసీపీదే" అన్నారు.లోకేష్ నాయకత్వం పట్ల ప్రశంసలు : లోకేష్ బాబులోని నాయకత్వ లక్షణాలు, అభివృద్ధిపట్ల నిబద్ధత గురించి ప్రశంసల వర్షం కురిపించారు. "యుద్ధ పరిస్థితుల్లోనూ నరేంద్ర మోదీ ఆయన కుటుంబాన్ని రెండు గంటలపాటు కలుసుకోవడం, మోదీ గారి గౌరవం పొందడం తెలుగుజాతికి గర్వకారణం" అన్నారు... ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి : “పేదలకు కూడు, గూడు, గుడ్డ ఉండాలని తపించిన ఎన్టీఆర్ గారికి భారతరత్న అందించడం దేశానికి గౌరవం,” అని అన్నారు. "2029లో తెలుగుదేశం ఘన విజయం సాధించి చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు" అని విశ్వాసం వ్యక్తం చేశారు.