అవగాహన ర్యాలీని ప్రారంభించిన గ్రూప్ కమాండర్
Mana News:- తిరుపతి నవంబర్ 20 మన న్యూస్ :- రాబోయే రోజుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ఎలక్ట్రిక్ వాహనాలదే ప్రాధాన్యత ఉంటుందని తిరుపతి ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ సతిందర్ దాహీయా తెలిపారు. బుధవారం హరే రామ హరే కృష్ణ మైదానంలో పర్యావరణ పరిరక్షణపై ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దానిపై అవగాహన కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ కల్నల్ ప్రేమ చంద్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మనోహర్ రెడ్డి, ఆనంద రెడ్డి, ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు.