మన న్యూస్, నెల్లూరు, మే 21:ఈనెల 23న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ , సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి , నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి , కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు ఏర్పాట్లపై సుధీర్ఘంగా చర్చించారు. కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాటు చేయాల్సిన వసతులపై సమీక్షించారు. సదుపాయాలపై పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే జిల్లా మహానాడులో తీర్మానించాల్సిన అంశాలపై వారు చర్చించారు.