మన న్యూస్,తిరుపతిః యోగాంధ్రా 2025 కు విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యోగా కార్యక్రమాన్ని బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. యోగా మాస్టర్లు ప్రజాప్రతినిధులు, అధికారులతో యోగ ఆసనాలను ప్రాక్టీస్ చేయించారు. సుమారు 40 నిమషాల పాటు యోగా ప్రాక్టీస్ జరిగింది. విశ్వమంతా యోగాతో ఆరోగ్యం నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డేను ని ఐదు లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి విశాఖపట్నంలో జరిగే యోగా డే లో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. సూరత్ లో 2023లో కోటి యాభై మూడు లక్షల మందితో సామూహిక యోగా నిర్వహించి గిన్నీస్ రికార్డ్ నెలకొల్పారని ఆయన చెప్పారు.ఈ రికార్డ్ బద్దులు కొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల మందితో సామూహిక యోగా ను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. యోగాను నిత్యం ప్రతి ఒక్కరు గంట పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సామూహిక యోగా లో ప్రజలంతా పాల్గొని రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేయాలని ఆయన కోరారు.
జూన్ 1 వ తేది విశాఖపట్నంలో11వ అంతర్జాతీయ యోగా డే ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి జూన్ 21వ వరకు యోగా మాసంగా ప్రభుత్వం ప్రకటించినట్లు ఆయన చెప్పారు. యోగా ను తిరుపతి జిల్లాలో ప్రతి మూలకు తీసుకెళ్ళాలని ఆయన కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు యోగా ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయిని ఆయన తెలిపారు. మన సంస్కృతి,సాంప్రదాయలు ప్రతిబంభించేలా యోగా ను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. యోగాను కేవలం జూన్ 21 వ తేది మాత్రానికే పరిమితం చేయకుండా నిత్యం చేయాలని ఆయన ప్రజలను కోరారు. కాగా యోగాను ప్రతి ఒక్కరు జీవితంలో ఒకభాగం చేసుకోవాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు అన్నారు. యోగాను ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. యోగాపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాల్సి అవసరం ఉందని ఆయన చెప్పారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పోరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరి, బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ ఛైర్ పర్శన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, బిజేపి తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జీ అజయ్ కుమార్, వైస్ ఛాన్సలర్ ఉమా, జాయింట్ కలెక్టర్ శుభం సబన్సల్, డి ఆర్ ఓ, ఆర్డీఓ, మున్సిపల్ కార్పోరేషన్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సహాయ కమిషనర్ అమరయ్య తదితరులు పాల్గొన్నారు.