మన న్యూస్, Vedurukuppam : మండలంలోని తిరుమలయ్య పంచాయతీ కి సంబంధించిన మాకు మంబాపురం గ్రామంలోనీ శ్రీ ప్రసన్న పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు సందర్భంగా బుధవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజ, అభిషేకములు ఘనంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు అదే విధంగా రాత్రి పెరుమాళ్ళపల్లి దళిత వాడకు సంబంధించిన వారిచే హరే రామ భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 7 గంటల నుండి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా సోమేంద్రపురం గ్రామానికి చెందిన చిన్నక్క వైఫ్ ఆఫ్ వాసుదేవ రెడ్డి దంపతులు మరియు డి శ్రీదేవి వైఫ్ ఆఫ్ కే బాబు రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక ఉత్సవాల్లో భక్తులు, చుట్టుపక్క గ్రామస్తులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.