మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ )
నిజాంసాగర్ మండలంలోని మల్లూరు,అచ్చంపేట్, బ్రాహ్మణపల్లి,మల్లూరు తాండ, గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గృహ నిర్మాణాల కోసం మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఎంపీడీవో గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలసి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన కులతల ప్రకారం ఇందిరమ్మ ఇల్లును నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అనంతరం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రొజెటింగ్ పత్రాలను అందజేసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బండ్ల ప్రవీణ్, కృష్ణారెడ్డి,శ్రీనివాస్,తదితరులు ఉన్నారు.