మన న్యూస్, కోవూరు, మే 20: మే 20 మంగళవారం కోవూరు మండలంలోని పివిఆర్ ఫంక్షన్ హాల్ నందు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మినీ మహానాడుకు విచ్చేసిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ , రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొలం రెడ్డి దినేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కోవూరు మండలాధ్యక్షులను ప్రకటించడం జరిగింది కోవూరు మండలానికి అధ్యక్షునిగా నన్ను ఎంపిక చేసిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి నా కృతజ్ఞతలు అని కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి కోవూరు మండలాధ్యక్షులు తెలియజేశారు.