మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారిని ప్రమీల అన్నారు.నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ఆమె సమావేశమయ్యారు.అనంతరం ఆమె మాట్లాడుతూ..ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా పనులను ప్రారంభించాలని ఇండ్ల నిర్మా ణం త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్,గ్రామపంచాయతీ కార్యదర్శి తుకారం, గ్రామస్తులు పాల్గొన్నారు.